2 సమూయేలు 18:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే వారు, “మీరు రాకూడదు. ఒకవేళ మేము పారిపోవలసి వస్తే, ప్రజలు మా గురించి పట్టించుకోరు. మాలో సగం మంది చనిపోయినా ప్రజలు పట్టించుకోరు. కాని మీరు మాలాంటి పదివేలమందితో సమానము. కాబట్టి మీరు పట్టణంలో ఉండి మాకు సహాయం అందిస్తే మేలు” అన్నారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 జనులు–నీవు రాకూడదు, మేము పారిపోయి నను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పది వేలమందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అందుకు వారు “నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి” అని చెప్పారు. Faic an caibideilపవిత్ర బైబిల్3 కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే వారు, “మీరు రాకూడదు. ఒకవేళ మేము పారిపోవలసి వస్తే, ప్రజలు మా గురించి పట్టించుకోరు. మాలో సగం మంది చనిపోయినా ప్రజలు పట్టించుకోరు. కాని మీరు మాలాంటి పదివేలమందితో సమానము. కాబట్టి మీరు పట్టణంలో ఉండి మాకు సహాయం అందిస్తే మేలు” అన్నారు. Faic an caibideil |