Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 పేతురు 3:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాశాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాశాను.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

1 ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాసాను.

Faic an caibideil Dèan lethbhreac




2 పేతురు 3:1
15 Iomraidhean Croise  

ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!


ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు.


హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.


నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడే మిమ్మల్ని హెచ్చరించాను, ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా మళ్ళీ చెప్పేదేమంటే నేను మళ్ళీ వచ్చినపుడు గతంలో పాపం చేసిన వారిని ఇతరులను ఎవరిని విడిచిపెట్టను.


ఎవరిపైనా చేతులను ఉంచడానికి తొందరపడకు, ఇతరుల పాపంలో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో.


ఈ కారణంగానే, నేను నీపై చేతులు ఉంచడం వలన నీవు పొందిన దేవుని కృపా వరాన్ని మరింత రగిలించి వృద్ధి చేయమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.


అయితే ప్రియమైన వారలారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికి, మీ రక్షణ గురించి మంచి సంగతులు ఉన్నాయని మేము నిశ్చయంగా ఉన్నాము.


ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.


ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి.


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు దీని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి కళంకం లేనివారిగా నిందలేనివారిగా ఆయనలో శాంతం కలవారిగా ఉండడానికి ప్రయత్నించండి.


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.


కాని ప్రియ స్నేహితుల్లారా, ఈ ఒక్క విషయాన్ని మరువకండి: దేవుని దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాల్లా, వెయ్యి సంవత్సరాలు ఒక రోజులా ఉన్నాయి.


మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఈజిప్టు దేశం నుండి విడిపించారు, కాని తర్వాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేశారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను.


Lean sinn:

Sanasan


Sanasan