Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 పేతురు 2:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 దైవభయం లేని దుర్మార్గుల లైంగిక వికార ప్రవర్తన చేత మనస్తాపానికి గురైన నీతిపరుడైన లోతును రక్షించాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

7 దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన, నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.

Faic an caibideil Dèan lethbhreac




2 పేతురు 2:7
14 Iomraidhean Croise  

అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు.


లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు.


కాని అక్కడికి త్వరగా పారిపోండి, ఎందుకంటే మీరు అక్కడికి చేరేవరకు నేను ఏమి చేయలేను” అని అన్నాడు. అందుకే ఆ పట్టణానికి సోయరు అని పేరు పెట్టబడింది.


దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు.


వారు లోతును పిలిచి, “రాత్రి నీ దగ్గరకు వచ్చిన ఆ మనుష్యులు ఎక్కడ? వారితో మేము లైంగికంగా కలుసుకునేలా బయటకు తీసుకురా” అని అన్నారు.


నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!


ప్రవక్తల గురించి: యెహోవాను బట్టి ఆయన మాట్లాడిన మాటలనుబట్టి నా హృదయం నాలో పగిలిపోయింది; నా ఎముకలన్నీ వణుకుతున్నాయి. త్రాగిన మత్తులో ఉన్నవాడిలా, ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను,


సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.


ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు కలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకున్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.


చాలామంది వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారు, వీరిని బట్టి సత్యమార్గంలో ఉన్నవారిని దూషిస్తారు.


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.


ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.


Lean sinn:

Sanasan


Sanasan