Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 పేతురు 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

6 దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని దహించి బూడిద చేశారు, భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు;

Faic an caibideil Dèan lethbhreac




2 పేతురు 2:6
20 Iomraidhean Croise  

సొదొమ గొమొర్రాల వైపు, ఆ మైదానమంతటిని చూశాడు, ఆ స్థలం నుండి కొలిమిలో నుండి వచ్చే పొగలా పొగ రావడం చూశాడు.


సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.


అప్పుడు రాజ్యాలకు వైభవంగా, బబులోనీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును సొదొమ గొమొర్రాల వలె దేవుడు పడగొడతారు.


సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత, అక్కడ ఎవరూ నివసించనట్లే, ఇక్కడ కూడా ఎవరూ నివసించరు” అని యెహోవా అంటున్నారు.


“ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది.


“నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు మీలో కొంతమందిని పడగొట్టాను. మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, అయినా మీరు నా వైపుకు తిరగలేదు, అని యెహోవా అంటున్నారు.


కాబట్టి, నా జీవం తోడు, మోయాబు సొదొమలా, అమ్మోను గొమొర్రాలా అవుతుంది. కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” అని ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.


పాపం చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారి ధూపార్తులు. వాటిని చెడగొట్టి, రేకులుగా చేసి, వాటిని బలిపీఠం కప్పుగా వాడాలి, అవి యెహోవా ఎదుట సమర్పించబడినవి కాబట్టి పవిత్రమైనవి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తులుగా ఉండును గాక.”


భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.


తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేది.


యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”


మనకు ఉదాహరణలుగా ఉండడానికి ఈ సంగతులు వారికి సంభవించి, రాబోయే యుగాంతంలో మనకు హెచ్చరికగా ఉండడానికి వ్రాయబడ్డాయి.


దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది.


కాబట్టి, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాము.


అందరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపజేస్తారు.”


అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.


Lean sinn:

Sanasan


Sanasan