Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 తిమోతికి 1:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగి ఉంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయినవారివలె చెడియున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగి ఉంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

19 మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగివుంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




1 తిమోతికి 1:19
25 Iomraidhean Croise  

మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా?


మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండవలసిందే.


ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు.


ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యథార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.


వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి.


విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.


కొందరు అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ విశ్వాసం నుండి తొలగిపోయారు. కృప నీకు తోడై ఉండును గాక!


అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.


వారు సత్యానికి దూరమయ్యారు. పునరుత్థానం ముందే జరిగిపోయిందని చెప్తూ, కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.


వారు సత్యం నుండి తొలగిపోయి కట్టుకథలు వినడానికి తమ చెవులను అప్పగిస్తారు.


బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు.


ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.


వారు మనలో నుండి బయలుదేరారు, కాని నిజానికి వారు మనకు సంబంధించినవారు కారు. ఎందుకంటే వారు మనకు సంబంధించినవారైతే మనతోనే నిలిచి ఉంటారు; అయితే వారు అలా వెళ్లిపోవడం వల్ల వారిలో ఒక్కరు కూడా మనకు సంబంధించినవారు కారని తెలుస్తుంది.


నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కాబట్టి భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న శోధన సమయంలో నేను నిన్ను కాపాడతాను.


కాబట్టి నీవు పొందిన వాటిని విన్నవాటిని జ్ఞాపకం చేసుకుని, వాటిని పాటిస్తూ గట్టిగా పట్టుకుని పశ్చాత్తాపపడు. కాని నీవు మేలుకోక పోతే నేను దొంగలా వస్తాను, నేను ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు.


నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు.


Lean sinn:

Sanasan


Sanasan