Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 థెస్సలొనీకయులకు 2:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 విశ్వాసులైన మీ ముందు మేము ఎంత పవిత్రంగా, నీతిగా, నిందారహితంగా నడచుకున్నామో దానికి మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంతో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. దీనికి మీరే సాక్షులు. దేవుడు కూడా దీనికి సాక్షి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.

Faic an caibideil Dèan lethbhreac




1 థెస్సలొనీకయులకు 2:10
26 Iomraidhean Croise  

మేలుకు ప్రతిగా కీడు చేయాలా? అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. నేను నీ ఎదుట నిలబడి వారి మీది నుండి మీ కోపం తొలగించమని వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.


మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు.


“మనం చేసిన తప్పులకు న్యాయంగానే శిక్షను అనుభవిస్తున్నాం కాని ఈయన ఏ తప్పు చేయలేదు” అన్నాడు.


వారు వచ్చినపుడు, వారితో ఈ విధంగా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతానికి వచ్చిన మొదటి రోజు నుండి మీతో గడిపిన సమయమంతటిలో నేను ఎలా జీవించానో మీకు తెలుసు.


మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని అని నేడు మీ ముందు ప్రకటిస్తున్నాను.


కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితితో, దేవుడు ఇచ్చే పవిత్రతతో మేము నడచుకున్నాము. లోకజ్ఞానంపై ఆధారపడక దేవుని కృపపై ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!


ఎల్లప్పుడు స్తుతించబడే యేసు ప్రభువుకు తండ్రియైన దేవునికి నేను అబద్ధమాడనని తెలుసు.


అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము.


అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మేమేంటో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నేను నమ్ముతున్నాను.


మీ హృదయంలో మాకు చోటియ్యండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని పాడుచేయలేదు, ఎవరినీ మోసగించలేదు


ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు.


మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి.


మా మాదిరిని మీరు ఎలా అనుసరించాలో అది మీకు తెలుసు. అంటే మేము మీ మధ్యన ఉన్నప్పుడు వట్టి చేతులతో సోమరులుగా కూర్చోలేదు,


నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.


అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం,


మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి.


Lean sinn:

Sanasan


Sanasan