Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 థెస్సలొనీకయులకు 1:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7-8 కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను; అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

7 కనుక మాసిదోనియ అకయ ప్రాంతాల్లో వున్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు.

Faic an caibideil Dèan lethbhreac




1 థెస్సలొనీకయులకు 1:7
14 Iomraidhean Croise  

వారు పట్టణం చేరి, తాము ఉంటున్న మేడ గదికి ఎక్కి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా; బర్తలోమయి, మత్తయి; అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే సీమోను, యాకోబు కుమారుడైన యూదా.


అక్కడినుండి మేము ప్రయాణం చేసి, రోమీయులున్న మాసిదోనియ ప్రాంతంలోని ముఖ్య పట్టణమైన ఫిలిప్పీకు వెళ్లాము. మేము అక్కడ చాలా రోజులు ఉన్నాము.


ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు.


అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు.


ఇదంతా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అకాయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్లాలి అని నిర్ణయించుకొన్నాడు. “నేను అక్కడికి వెళ్లిన తర్వాత రోమా పట్టణాన్ని కూడా దర్శించాలి” అనుకున్నాడు.


యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకాయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు.


దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకాయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:


సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా చెప్పి, అకాయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది.


అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కాబట్టి దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు,


నిజానికి, మాసిదోనియ అంతటా ఉన్న దేవుని కుటుంబమంతటికి ప్రేమ చూపిస్తున్నారు. అయినా సహోదరీ సహోదరులారా, మీరు ఇంకా అధికంగా ప్రేమించాలని చెప్తున్నాము.


నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.


నీవు ప్రతి విషయంలో వారికి మాదిరిగా జీవిస్తూ, ఏది మంచిదో అదే చేస్తూ, నీ బోధలలో నిజాయితీని, గంభీరతను చూపిస్తూ,


మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి.


Lean sinn:

Sanasan


Sanasan