Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 సమూయేలు 2:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 “అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 ఇక డంబాలు పలుకవద్దు! గర్వపు మాటలు కట్టి పెట్టండి! ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 “అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




1 సమూయేలు 2:3
26 Iomraidhean Croise  

ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు),


దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక, అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు.


మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.


వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి.


అహంకారంతో ధిక్కారంతో గర్వంతో నీతిమంతులను దూషించే వారి అబద్ధపు పెదవులు మూయబడాలి.


హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?


ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.


వారు అహంకారపు మాటలు మాట్లాడతారు; కీడుచేసేవారంతా గొప్పలు చెప్పుకుంటారు.


ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.


“కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా?


యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.


నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.


నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!


“యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి మనస్సును పరీక్షించి, ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.”


మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను.


ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.


“టెకేల్: నీవు త్రాసులో తూచబడ్డావు, తక్కువగా ఉన్నట్లు తేలింది.


యెహోవా చెప్పేదేమంటే, “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వించి మాట్లాడారు.” “అయినా మేము నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాము?” అని మీరు అడుగుతున్నారు.


దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరు చేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది.


“శక్తిమంతుడైన యెహోవా దేవుడు! శక్తిమంతుడైన దేవుడు యెహోవా! అది ఆయనకు తెలుసు! ఇశ్రాయేలుకు తెలియనివ్వండి! ఇది యెహోవా పట్ల ద్రోహంతో గాని తిరుగుబాటుతో గాని చేసివుంటే ఈ రోజు మమ్మల్ని రక్షించవద్దు.


ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి.


అప్పుడు జెబూలు అతనితో, “ ‘మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు?’ అని నీవు చెప్పిన గొప్పలు ఏమయ్యాయి, నీవు హేళన చేసింది వీరిని కాదా? ఇప్పుడు లేచి వెళ్లి వారితో పోరాడు!” అన్నాడు.


అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు.


Lean sinn:

Sanasan


Sanasan