Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 సమూయేలు 2:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను– నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నావిరోధులమీద నేను అతిశయపడుదును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 హన్నా దేవుని ఇలా కీర్తించెను: “నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను. నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము.

Faic an caibideil Dèan lethbhreac




1 సమూయేలు 2:1
37 Iomraidhean Croise  

అప్పుడు, యెహోషాపాతు నేతృత్వంలో, యూదా యెరూషలేము ప్రజలందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎందుకంటే వారి శత్రువులపై యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు.


కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.


నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను నా నుదిటిని దుమ్ములో ఉంచాను.


యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు.


అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.


ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. యెహోవాను స్తుతించండి.


యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.


యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.


అతని హృదయ కోరికను మీరు తీర్చారు అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. సెలా


నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది ఆయన రక్షణలో సంతోషిస్తుంది.


ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది.


నా నోరు మీ స్తుతితో నిండి ఉంది; నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.


ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.


ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే, మీ దయతో మా కొమ్మును హెచ్చిస్తారు.


నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.


నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి, నా నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చంపబడుతుంది.


తద్వార నేను మీ స్తుతులను సీయోను కుమారీ ద్వారాల దగ్గర ప్రకటిస్తాను, మీ రక్షణలో నేనానందిస్తాను.


మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి.


దాని తర్వాత మోషే ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు: “నేను యెహోవాకు పాడతాను, ఆయన ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశారు.


మిర్యాము వారితో ఇలా పాడింది: “యెహోవాకు పాడండి, ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో విసిరిపడవేశారు.”


ప్రవక్తయైన హబక్కూకు చేసిన ప్రార్థన. షిగియోనోతు.


నేను యెహోవాయందు ఆనందిస్తాను, నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.


దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.


అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము.


ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు; అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు జనులను, భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు. ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు, మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”


ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.


ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.


దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.


మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు.


“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”


యెహోవా ఆమెకు పిల్లలు పుట్టకుండా చేశారు, కాబట్టి పెనిన్నా హన్నాకు చిరాకు కలిగించాలని ఎత్తిపొడుపు మాటలతో రెచ్చగొట్టేది.


ఇది ఏటేటా కొనసాగింది. హన్నా యెహోవా మందిరానికి వెళ్లినప్పుడెల్లా, ఆమె ఏడుస్తూ తినడం మానివేసేలా పెనిన్నా ఆమెను రెచ్చగొట్టేది.


Lean sinn:

Sanasan


Sanasan