Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 పేతురు 4:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

8 అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.

Faic an caibideil Dèan lethbhreac




1 పేతురు 4:8
17 Iomraidhean Croise  

పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది.


మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.


ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.


సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.


మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.


ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.


వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి.


మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక.


సహోదరీ సహోదరులారా, మేము మీ గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీ విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది, మీ అందరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరింత అధికమవుతూ ఉంది.


ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యథార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.


సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి.


అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే “అవును” కాదంటే “కాదు” అని లేకపోతే మీరు శిక్షించబడతారు.


తప్పిపోయిన ఆ ఒక్క పాపిని తిరిగి వెనుకకు తీసుకువచ్చినవారు ఆ పాపి ఆత్మను మరణం నుండి రక్షించారని, అనేక పాపాలు కప్పివేయబడ్డాయని మీరు తెలుసుకోండి.


ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.


ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.


Lean sinn:

Sanasan


Sanasan