Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 పేతురు 4:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

11 ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవచేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి, అప్పుడు మనం అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక. ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac




1 పేతురు 4:11
47 Iomraidhean Croise  

మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.


దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు.


కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే, వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి వారి చెడు మార్గాల నుండి వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు.


ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి! ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం; ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది.


ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను. ఆయన అధికారం శాశ్వత అధికారం; ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.


ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.


మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’


అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.


అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండమీద తనతో మాట్లాడిన దూతతో మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు.


ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.


నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.


ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి.


నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి.


అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే.


దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి.


మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.


మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.


ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.


మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.


ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.


చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.


ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.


మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.


దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము.


కాబట్టి నిత్య రాజుగా ఉన్న, అమరుడగు అదృశ్యుడైన ఒకే దేవునికి ఘనత మహిమలు నిరంతరం కలుగును గాక ఆమేన్.


ఆయన ఒక్కడే మరణం లేనివాడు, ఆయన సమీపించలేనంత వెలుగులో నివసిస్తాడు, ఆయనను ఎవరూ ఎన్నడు చూడలేదు, ఎన్నడు చూడలేరు. అలాంటి దేవునికే ఘనత ప్రభావాలు నిరంతరం కలుగును గాక ఆమేన్.


నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి.


కాబట్టి ఈ విషయాలను నీవు వారికి బోధించాలి, నీకు ఇవ్వబడిన పూర్తి అధికారంతో వారిని హెచ్చరించి గద్దించు. నిన్ను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.


దేవుని వాక్యాన్ని మీకు బోధించిన మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత విధానం వలన కలిగిన ఫలితాన్ని తెలుసుకోండి, వారి విశ్వాసాన్ని అనుకరించండి.


నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరము.


నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు;


తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.


దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.


మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.


అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి.


అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడితే సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవున్ని స్తుతించండి.


ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్.


మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.


Lean sinn:

Sanasan


Sanasan