Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 పేతురు 3:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఎందుకంటే, “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడు మాట్లాడకుండ నాలుకను మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 –జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది: “బ్రతకాలని ఇష్టపడే వాడు, మంచిరోజులు చూడదలచినవాడు, తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి. తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఎందుకంటే, “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడు మాట్లాడకుండ నాలుకను మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

10 ఎందుకంటే, “ఎవరు జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడ్డ దానిని పలుకకుండా తమ నాలుకను కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి.

Faic an caibideil Dèan lethbhreac




1 పేతురు 3:10
24 Iomraidhean Croise  

అప్పుడు సాతాను, “తన చర్మం కాపాడుకోడానికి చర్మాన్ని ఇస్తాడు! మనిషి తన ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు.


సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు. జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’


“పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.


మీరు ఏర్పరచుకున్న వారి అభివృద్ధిని నేను ఆస్వాదించగలను, మీ దేశము యొక్క ఆనందంలో పాలుపంచుకోగలను మిమ్మల్ని స్తుతించడంలో మీ వారసులతో చేరతాను.


నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: సజీవులన్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.


వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు, వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు.


ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది; దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు.


అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి, నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి.


వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.


నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు.


నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను.


అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు.


ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు.


నతనయేలు తన దగ్గరకు రావడం చూసిన యేసు, “ఇతడు ఏ కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నారు.


తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకుంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కోసం కాపాడుకుంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


అవి కేవలం మామూలు మాటలు కావు, అవి మీకు జీవము. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనపరుచుకోబోయే దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు” అన్నాడు.


తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.


కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి.


“ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.”


వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు.


Lean sinn:

Sanasan


Sanasan