Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 పేతురు 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఎందుకంటే లేఖనాల్లో, “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి; ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని వ్రాయబడి ఉంది.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఏలయనగా –ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను! పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది. ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఎందుకంటే లేఖనాల్లో, “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి; ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని వ్రాయబడి ఉంది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

6 ఎందుకంటే లేఖనాలలో చెప్పబడిన రీతిగా: “చూడండి, ఎన్నుకోబడిన అమూల్యమైన మూలరాతిని, సీయోనులో స్ధాపిస్తున్నాను; ఆయనలో విశ్వాసముంచిన వాడు, ఎన్నటికీ సిగ్గుపడడు.”

Faic an caibideil Dèan lethbhreac




1 పేతురు 2:6
27 Iomraidhean Croise  

కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,


నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.


ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ, మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు: “నేను వీరుడికి సాయం చేశాను. ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను.


కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.


“నీ మీద కోప్పడిన వారందరు ఖచ్చితంగా సిగ్గుపడి అవమానం పొందుతారు; నిన్ను వ్యతిరేకించేవారు కనబడకుండా నశించిపోతారు.


“ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.


నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.


ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను సిగ్గుపరచబడను. నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను.


“భయపడకు; నీవు సిగ్గుపరచబడవు అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు. నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు.


అయితే ముందు సత్య గ్రంథంలో వ్రాయబడింది ఏంటో నీకు చెప్తాను. (వాళ్ళను ఎదిరించడానికి మీ అధిపతియైన మిఖాయేలు తప్ప ఎవరూ నా పక్షంగా నిలువరు.


యూదా నుండి మూలరాయి వస్తుంది, అతని నుండి డేరా మేకు, అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు.


“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.


మీరు ఈ లేఖనం చదువలేదా: “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;


యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాల్లో, “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి?


ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, “వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అని అంటూ ఎగతాళి చేశారు.


లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు.


“సహోదరీ సహోదరులారా, యేసును బంధించడానికి వారికి దారి చూపించిన యూదా గురించి, చాలా కాలం క్రిందట దావీదు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన లేఖనాలు నెరవేరవలసి ఉంది.


“ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది.


మనం ఆయన దృష్టిలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని లోకం సృష్టించబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు.


క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.


ప్రతి లేఖనం దేవుని ప్రేరణ చేతనే కలిగింది, అది బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది.


ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి.


అంతేకాదు, “అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి, వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.” వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.


అన్నిటికంటే ముఖ్యంగా ప్రవక్తల సొంత ఊహల్లో నుండి లేఖనంలోని ప్రవచనాలు పుట్టలేదని మీరు తప్పక గుర్తుంచుకోవాలి.


అంతేగాక, వీటన్నిటిని గురించి అన్ని పత్రికల్లో చెప్పాడు, ఇతని పత్రికల్లో కొన్ని విషయాలు అర్థంచేసుకోడానికి కష్టతరంగా ఉంటాయి. వీటిని గ్రహించలేని జ్ఞానహీనులు, అస్థిరులు మిగతా లేఖనాలను అపార్ధం చేసుకొన్నట్లే, తమ స్వనాశనానికి వేరొక రీతిగా అపార్ధం చేసుకుంటారు.


Lean sinn:

Sanasan


Sanasan