Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 పేతురు 1:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

21 ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

21 మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.

Faic an caibideil Dèan lethbhreac




1 పేతురు 1:21
34 Iomraidhean Croise  

నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.


“కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.


యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


అప్పుడు యేసు బిగ్గరగా, “ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు నన్ను మాత్రమే కాదు, నన్ను పంపినవానిని కూడ నమ్ముతారు.


“మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి.


అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.


యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు: “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు.


“తండ్రీ, నీవు నన్ను సృష్టికి పునాది వేయబడక ముందే ప్రేమించి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడడానికి నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నీవు నాకు ఇచ్చిన వారందరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.


తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.


ఎందుకంటే దేవుడు పరిమితి లేకుండా ఆత్మను అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు పంపినవాడు దేవుని మాటలనే మాట్లాడతాడు.


కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కాబట్టి దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు.


మన పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకున్నా, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు.


మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులము.


మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు.


మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు.


మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచి దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన మన కోసం కూడా ఆ వాక్యం వ్రాయబడింది.


క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి?


ఈ కారణాన్ని బట్టి, ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి,


యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది.


మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,


నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూశారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.


కాని, యేసు కొంతకాలం వరకు దేవదూతల కంటే తక్కువ చేయబడి, దేవుని కృప వల్ల అందరి కోసం మరణాన్ని రుచిచూశారు కాబట్టి ఇప్పుడు మహిమ ప్రభావాలతో కిరీటం ధరించుకొని ఉన్నట్లు మనం ఆయనను చూస్తున్నాము.


అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం,


తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.


క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు.


మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు.


ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.


Lean sinn:

Sanasan


Sanasan