ఫిలిప్పీయులకు 4:3 - పవిత్ర బైబిల్3 నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అవును, నిజమైన సహకారీ ఆ స్ర్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము3 అవును, నా నిజమైన సహకారి, ఈ స్త్రీలు క్లెమెంతుతో, మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కనుక వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడివున్నాయి. Faic an caibideil |
నేను చనిపోయినవాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది.