సంఖ్యా 2:2 - పవిత్ర బైబిల్2 “ఇశ్రాయేలు ప్రజలు వారి డేరాను సన్నిది గుడారం చుట్టూ వేసుకోవాలి. ఒక్కోవంశానికి దాని స్వంత ధ్వజం ఉంటుంది, ఎవరి వంశ ధ్వజం దగ్గర వారు నివాసం చేయాలి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –ఇశ్రాయేలీయులందరు తమతమపితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమతమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.” Faic an caibideil |
వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి. ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు. ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు. ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు. యుద్ధానికి ముందు ఊదే శంఖంలా వారు దీనిని తేటగా వింటారు.
ఆలయంలో నుండి వచ్చిన కంఠస్వరం నాతో ఇలా అన్నది: “నరపుత్రుడా, ఇది నా సింహాసనం, పాదపీఠం నెలకొని వున్న చోటు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఈ ప్రదేశంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు వంశం మరెన్నడూ నా పవిత్ర నామాన్ని పాడు చేయదు. వ్యభిచార పాపాల చేత, ఈ ప్రదేశంలో రాజుల శవాలను పాతిపెట్టిన దోషాలచేత రాజులు, వారి ప్రజలు నా పేరును అవమాన పర్చరు.