యిర్మీయా 48:2 - పవిత్ర బైబిల్2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు. మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు. ‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు. మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు. కత్తి నిన్ను వెంటాడుతుంది. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 హెష్బోనులో వారు–అది ఇకను జనము కాకపోవు నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడుచేయనుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మోయాబు గౌరవం అంతరించింది. వాళ్ళ శత్రువులు హెష్బోనులో దానికి కీడు చేయాలని ఆలోచిస్తున్నారు. ‘రండి, అది ఒక దేశంగా ఉండకుండా దాన్ని నాశనం చేద్దాం. మద్మేనా కూడా అంతరించి పోతుంది. కత్తి నిన్ను తరుముతూ ఉంది.’ Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మోయాబును ఇకపై పొగడరు; హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ మద్మేను ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; ఖడ్గం నిన్ను వెంటాడుతుంది. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మోయాబును ఇకపై పొగడరు; హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ మద్మేను ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; ఖడ్గం నిన్ను వెంటాడుతుంది. Faic an caibideil |
మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది. ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు. దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు. ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు. ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.
యెహోవా ఇలా అంటున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, భయపడకు. నేను నీతో వున్నాను. నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
“హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. రబ్బోతు-అమ్మోను మహిళల్లారా, విలపించండి! విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు. వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.
వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను. వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను. వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను. నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది. “ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను. నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.