Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 3:5 - పవిత్ర బైబిల్

5 ‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు. దేవుని కోపం అల్పమైనది. అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు. “యూదా, నీవీ విషయాలు అంటూనే నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 “నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా?” అని అంటూనే నువ్వు చేయాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’ నీవు ఇలా మాట్లాడతావు, కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’ నీవు ఇలా మాట్లాడతావు, కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు.”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 3:5
14 Iomraidhean Croise  

కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు.


నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?


దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము! నీ ప్రజలను సంతోషింపజేయుము.


నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను. నేను ఎప్పటికీ కోపంగానే ఉండను. నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ, వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.


యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు. మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు. దయచేసి మమ్మల్ని చూడు, మేము నీ ప్రజలము.


యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు: “‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’ ఇది యెహోవా వాక్కు. ‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను. నేను నిండు దయతో ఉన్నాను.’ ఈ వాక్కు యెహోవాది. ‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.


యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు. కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు? వారి అబద్ధాలను వారే నమ్ముతారు. వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.


వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను. కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు. ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు. ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు. ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు. వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు.


“‘చూడండి! ఇశ్రాయేలు పాలకులలో ప్రతివాడూ ఇతరులను చంపటానికి యెరూషలేములో తనను తాను బాగా బలపర్చుకున్నాడు.


పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి. ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు. తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు. ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తి ఉంది.


ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.


Lean sinn:

Sanasan


Sanasan