యిర్మీయా 21:3 - పవిత్ర బైబిల్3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యిర్మీయా వారితో ఇట్లనెను–మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యిర్మీయా వారితో ఇలా అన్నాడు. “మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి, Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి, Faic an caibideil |
యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసుకొనుము. బబులోను రాజైన నెబుకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబుకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, కల్దీయుల నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుపయోగమయ్యేలా నేను చేస్తాను. “‘బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూషలేము లోనికి రప్పిస్తాను.