Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 17:3 - పవిత్ర బైబిల్

3 మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన సంగతులు వారికి గుర్తున్నాయి. యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి. వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను! మీ దేశంలోగల ఉన్నత స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) ప్రజలు నాశనం చేస్తారు. ఆ ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు పాపం చేశారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవుచేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 సరిహద్దుల్లోని పర్వతాల మీదున్న వారి బలిపీఠాలు వారికి గుర్తే. నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని దోపుడు సొమ్ముగా నేనప్పగిస్తాను. మీ పాపం మీ దేశమంతా ఉంది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి దేశంలోని నా కొండలను, నీ ధనాన్ని, నీ సంపదను, నీ క్షేత్రాలతో పాటు దోపుడు సొమ్ముగా ఇస్తాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి దేశంలోని నా కొండలను, నీ ధనాన్ని, నీ సంపదను, నీ క్షేత్రాలతో పాటు దోపుడు సొమ్ముగా ఇస్తాను.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 17:3
23 Iomraidhean Croise  

నెబుకద్నెజరు యెరూషలేమునుండి, యెహోవా యొక్క ఆలయములోని నిధులన్నిటినీ, రాజభవనములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు రాజయిన సొలొమోను యెహోవా యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్రలను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఇది సంభవించింది.


ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు. దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.


యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి.


సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు. యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు. రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు. ఏ ఒక్కరికీ రక్షణ లేదు.


యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి. ఆ సంపదను పరులకు ఇస్తాను. అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు. నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను. ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది. యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.


యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు.


“యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను. నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు. యెరూషలేము వాసులారా ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.” కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.


“ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా ఈ విషయాలు చెప్పియున్నాడు: “సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది! గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ పొదలతో నిండినట్లవుతుంది.


శత్రువు తన చేతిని చాచాడు. అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు. వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమె చూసింది. ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.


నిన్ను నీ ప్రేమికుల చేతుల్లో పడవేస్తాను. వారు నీ గుట్టలన్నీ ధ్వంసం చేస్తారు. వారు నీ ఆరాధనా స్థలాలన్నీ తగలబెడతారు. వారు నీ బట్టలు చించివేస్తారు. వారు నీ అందమైన ఆభరణాలన్నీ తీసుకొంటారు. వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నేను నిన్ను కనుగొన్నప్పుడు వున్నట్లు నగ్నంగా వదులుతారు.


నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “ప్రజలను ఒక చోట సమీకరించండి. ఆ ప్రజలందరు ఒహొలా, ఒహొలీబాలను శిక్షింపనీయండి. ఈ ప్రజా సమూహం ఈ ఇద్దరు స్త్రీలను శిక్షించి, వారిని ఎగతాళి చేస్తారు.


ఆ పర్వతాలకు ఈ విషయాలు తెలియజెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతములారా, నా ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! నా ప్రభువైన యెహోవా కొండలకు, పర్వతాలకు, కనుమలకు, లోయలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి! (దేవుడనగు) నేను మీపై యుద్ధానికి శత్రువును రప్పిస్తున్నాను. మీ ఉన్నత స్థలాలు. నేనే నాశనం చేస్తాను


మీ ఉన్నత స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా ఉంటారు.


మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది. అది దున్నిన పొలంలా తయారవుతుంది. యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది. ఆలయపు పర్వతం పొదలతో నిండిన వట్టి కొండలా తయారవుతుంది.


అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షాతోటలు నాటుకొన్నవారు ఆ ద్రాక్షాపండ్ల రసం తాగరు. ఇతరులకు అవి లభిస్తాయి.”


Lean sinn:

Sanasan


Sanasan