Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ప్రకటన 8:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకొన్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి గొప్ప పరిమాణంలో ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 మరియు సువర్ణధూపార్తి చేతపట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్య బడెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకున్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి చాలా ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకున్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి చాలా ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.

Faic an caibideil Dèan lethbhreac




ప్రకటన 8:3
32 Iomraidhean Croise  

ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు.


అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మనకొరకు దేవుని వేడుకొనే యేసు క్రీస్తు తప్ప మరి ఎవరూ కాదు.


తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కొరకు ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కనుక వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.


దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతి పలకలు ఉన్నాయి.


బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తల మీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూసాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.


మరో దేవదూత బలిపీఠం నుండి వచ్చాడు. అతనికి బలిపీఠం మీద ఉన్న అగ్నిపై అధికారం ఉంది. అతడు పదునైన కొడవలి గలవానితో బిగ్గరగా, “భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పండిపోయాయి గనుక నీ పదునైన కొడవలితో ద్రాక్షపండ్ల గుత్తులను కోయుము” అని చెప్పాడు.


ఆయన ఆ గ్రంథపు చుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణెను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకొన్నారు.


ఆ వధించబడిన గొర్రెపిల్ల ఐదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూసాను.


అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పు దిక్కు నుండి మీదికి రావడం చూసాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించే అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా,


అప్పుడు దూత చేతి నుండి ఆ ధూపద్రవ్యాల పొగ దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిసి మీదికి లేచి దేవుని సన్నిధికి చేరింది.


ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి.


ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది.


Lean sinn:

Sanasan


Sanasan