Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ప్రకటన 6:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 నేను చూస్తున్నప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద సవారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్ళాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

2 నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు.

Faic an caibideil Dèan lethbhreac




ప్రకటన 6:2
22 Iomraidhean Croise  

యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు.


ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, “భూలోక రాజ్యం ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి కనుక ఆయన ఎల్లకాలం పరిపాలిస్తాడని.”


దేశాలు కోపగించినందుకు నీ ఉగ్రత వచ్చింది. ఇక చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి, సేవకులైన ప్రవక్తలకు, నీ నామాన్ని గౌరవించే నీ ప్రజలకు అల్పులైనా ఘనులైనా నీ ప్రజలకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయడానికి సమయం వచ్చింది.”


నేను చూస్తుండగా ఒక తెల్లని మేఘం మీద మనుష్యకుమారునిలా ఉన్న ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన తల మీద బంగారు కిరీటాన్ని ధరించి చేతిలో పదునైన కొడవలిని పట్టుకుని ఉన్నాడు.


నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూసాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, ఆ మృగం యొక్క విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను ఎదిరిస్తూ జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకొని ఉన్నారు.


ఈ రాజులందరు మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కనుక ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతోపాటు ఆయనచే పిలువబడిన వారు, ఎన్నుకోబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.


తెల్లని, పవిత్రమైన సున్నిత నార వస్త్రాలను ధరించి తెల్లని గుర్రాల మీద సవారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి.


జయించినవారికి నేను జయించి, నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే వానిని నా సింహాసనంలో నాతో పాటు కూర్చోనిస్తాను.


ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటంలాంటివి ఉన్నాయి; వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి.


Lean sinn:

Sanasan


Sanasan