Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ఫిలిప్పీయులకు 4:17 - తెలుగు సమకాలీన అనువాదము

17 నేను మీ కానుకలను కోరుకోవడం లేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

17 నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను.

Faic an caibideil Dèan lethbhreac




ఫిలిప్పీయులకు 4:17
26 Iomraidhean Croise  

మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకొని మీరు వెళ్లి నిలిచివుండే ఫలం ఫలించాలని, మిమ్మల్ని నియమించాను. కనుక మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను.


మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.


నేను ఈ పనిని ముగించాక ఖచ్చితంగా విరాళం వారికందేలా చూస్తాను, తరువాత అక్కడి నుండి స్పెయినుకు బయలుదేరి మార్గంలో మిమ్మల్ని కలుస్తాను.


నన్ను అవివేకిగా ఎవరు భావించవద్దని మరల చెప్తున్నాను; ఒకవేళ మీరు అలా భావిస్తే అవివేకంగానైనా మీరు నన్ను చేర్చుకోండి అప్పుడు నేను కొంచెం గొప్ప చెప్పుకుంటాను.


అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా ఇచ్చేవిగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేవిగా సిద్ధపడి ఉండడం కొరకు ఏర్పాట్లన్ని పూర్తిచేయాడానికి మీ దగ్గరకు ముందుగానే వెళ్ళమని సహోదరులను అడగడం అవసరమని నేను అనుకున్నాను.


నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగివుండడం నేను నేర్చుకున్నాను.


మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి.


అతడు త్రాగుబోతుగా ఉండకూడదు, దుర్మార్గునిగా కాక సౌమ్యునిగా ఉంటూ, కొట్లాడేవానిగా డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు.


డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి మూలం. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు.


సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కనుక, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోపపడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు.


మన ప్రజలు నిష్ఫలమైన జీవితాలను జీవించకుండా అవసరాలకు తగినట్లు మంచి పనులు చేయడంలో శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి.


దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు.


మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక, దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి, దుర్లాభ అపేక్షతో కాక మనఃపూర్వకంగా దాన్ని కాయండి;


వారు సరియైన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వానికి వచ్చే జీతాన్ని ప్రేమించిన బెయేరు కుమారుడైన బిలాము మార్గాన్ని అనుసరించడానికి వెళ్ళారు.


ఈ బోధకులు పేరాశ గలవారైవుండి, కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు, వారి తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.


వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడంవలన నాశనం చేయబడ్డారు.


Lean sinn:

Sanasan


Sanasan