Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 తిమోతికి 4:17 - తెలుగు సమకాలీన అనువాదము

17 కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.

Faic an caibideil Dèan lethbhreac




2 తిమోతికి 4:17
35 Iomraidhean Croise  

కానీ వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది;


ఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్ళారా చూసినవారు వాక్య ఉపదేశకులుగా మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు కనుక,


ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను మరియు జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.


ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యం ఇచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వాలి” అని చెప్పారు.


అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు మరియు యూదేతరులకు మరియు వారి రాజులకు నా నామంను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం.


యూదయలో ఉన్న అవిశ్వాసుల నుండి నేను తప్పించబడేలా, యెరూషలేముకు నేను తీసుకెళ్తున్న విరాళాన్ని అక్కడ ఉన్న ప్రభువు ప్రజలు సంతోషంగా స్వీకరించేలా ప్రార్థించండి.


అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండడానికి ముఖ్యంగా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.


ప్రభువు ప్రజలలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకొన్నారు.


నన్ను నమ్మకమైన వానిగా తలంచి బలపరచి తన సేవ కొరకు నన్ను నియమించిన, మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.


నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు.


దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.


హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాలలో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు.


కాని నీవైతే అన్ని పరిస్థితులలో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పనిచేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.


ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు.


వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు,


మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.


అదే నిజమైతే, భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు, అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు.


Lean sinn:

Sanasan


Sanasan