Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 తిమోతికి 4:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 నేను దేవుని యెదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు యెదుట నీకు ఇచ్చే ఆజ్ఞ యిదే:

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 నేను దేవుని ఎదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు ఎదుట నీకు ఈ బాధ్యతను ఇస్తున్నాను:

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 నేను దేవుని ఎదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు ఎదుట నీకు ఈ బాధ్యతను ఇస్తున్నాను:

Faic an caibideil Dèan lethbhreac




2 తిమోతికి 4:1
35 Iomraidhean Croise  

ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


“గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి.


“ఎలాగైతేనేం, అతడు రాజ్యాన్ని స్వాధీనపరచుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. తరువాత అతడు తాను డబ్బు ఇచ్చిన సేవకులు దానితో ఏమి లాభం పొందారో తెలుసుకోవడానికి వారిని పిలిపించాడు.


ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలో వస్తునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.


దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వుమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు.


ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి ప్రతి ఒక్కరికి దీనిని రుజువుపరిచాడు.”


నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పుతీర్చే దినాన ఇలా జరుగుతుంది.


మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతోపాటు మహిమలో ప్రత్యక్షమవుతారు.


ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.


ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండా, ఎవరి పట్ల భేదం చూపకుండా నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని యెదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఏర్పరచబడిన దేవదూతల యెదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.


అయితే మరణాన్ని నాశనం చేసి, జీవాన్ని, నిత్యత్వాన్ని సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకొనివచ్చిన మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత వలన అది నేడు మనకు వెల్లడి చేయబడింది.


దేవుని ప్రజలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉండు. వినేవారిని నాశనం చేయడమే తప్ప ఏ విలువ లేని మాటల గురించి వాదించవద్దని దేవుని యెదుట వారిని హెచ్చరించు.


నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక! ఆమేన్.


కనుక నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కొరకు దాచబడివుంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.


స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.


అవి మీ విశ్వాసం యదార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం కూడ అగ్ని చేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటె ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి, అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది, దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి.


కాని వారు దేవుని యెదుట సమాధానం చెప్పాల్సివుంది. ఆయన సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు.


ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు ఎప్పటికి వాడబారని మహిమ కిరీటం పొందుతారు.


అప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యంలోనికి ఘనమైన స్వాగతం మీకు లభిస్తుంది.


ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనత మహిమను పొందినపుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను అని మహత్తరమైన మహిమ నుండి ఒక శబ్దం పలికింది.”


కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగివుండునట్లు, మీరు ఆయనలో కొనసాగండి.


“ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు.” “ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు “ఆయనను చూసి బిగ్గరగా విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్.


Lean sinn:

Sanasan


Sanasan