Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 తిమోతికి 3:15 - తెలుగు సమకాలీన అనువాదము

15 క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు.

Faic an caibideil Dèan lethbhreac




2 తిమోతికి 3:15
38 Iomraidhean Croise  

అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కనుక మీరు పొరపాటు పడుతున్నారు.


ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు.


బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, మరియు దేవుని దయ ఆయన మీద ఉండింది.


ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాలలో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.


అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.


అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు.


కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మడం లేదు, అలాంటప్పుడు నేను చెప్పేది ఎలా నమ్ముతారు?”


ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”


ఆయన గురించి వ్రాయబడిన వాటన్నిటిని వారు నెరవేర్చిన తర్వాత, ఆయనను సిలువ మీది నుండి దించి సమాధిలో పెట్టారు.


పౌలు దెర్బేకు వచ్చి అక్కడి నుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు మరియు తండ్రి గ్రీసు దేశస్థుడు.


పౌలు తన అలవాటు ప్రకారం, మూడు విశ్రాంతి దినాలు సమాజమందిరంలోనికి వెళ్లి లేఖనాలలో నుండి వారితో చర్చిస్తూ,


అంతలో ఫేస్తు అతని మాటలను మధ్యలో ఆపుతూ, “పౌలు! నీకు మతిభ్రమించింది. నీ గొప్ప విద్యలు నిన్ను పిచ్చి పట్టించాయి” అని గట్టిగా అరిచాడు.


ఈ సువార్త ఏమంటే దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు.


శారీరకంగా సున్నతి చేయబడకపోయినా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం జీవిస్తున్నవారు, మీరు ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగియున్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు.


దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు, సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది.


తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి.


నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో.


క్రీస్తుయేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు అనే నేను,


నీలో ఉన్న యదార్థమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, అది మొదట నీ అమ్మమ్మ లోయిలోను తరువాత నీ తల్లియైన యునీకేలో ఉండింది. ఆ విశ్వాసమే ఇప్పుడు నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.


అంతేగాక, వీటన్నిటిని గురించి అన్ని పత్రికల్లో చెప్పాడు, ఇతని పత్రికలలో కొన్ని విషయాలు అర్థంచేసుకోడానికి కష్టతరంగా ఉంటాయి. వీటిని గ్రహించలేని జ్ఞానహీనులు, అస్థిరులు మిగతా లేఖనాలను అపార్ధం చేసుకొన్నట్లే, తమ స్వనాశనానికి వేరొక రీతిగా అపార్ధం చేసుకుంటారు.


అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కొరకు సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగివుండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు.


Lean sinn:

Sanasan


Sanasan