Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 తిమోతికి 2:25 - తెలుగు సమకాలీన అనువాదము

25 దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25-26 దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.

Faic an caibideil Dèan lethbhreac




2 తిమోతికి 2:25
30 Iomraidhean Croise  

నేను సౌమ్యుడను, దీనమనస్సు గలవాడిని కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది.


ఎలాగంటే, యోహాను నీతి మార్గాన్ని చూపించడానికి మీ దగ్గరకు వచ్చాడు, కాని మీరు అతన్ని నమ్మలేదు, కాని పన్ను వసూలు చేసేవారు వేశ్యలు అతన్ని నమ్మారు. అది చూసిన తర్వాత కూడా, మీరు పశ్చాత్తాపపడి ఆయనను నమ్మలేదు” అని చెప్పారు.


ఆయన, “కాలము పూర్తయింది. దేవుని రాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి!” అని చెప్పారు.


నేను మనుష్యుల సాక్ష్యాన్ని కోరను కానీ, మీరు రక్షింపబడాలని దీనిని చెప్తున్నాను.


వారు ఈ మాటలను విన్నప్పుడు, వారు ఏ అభ్యంతరం చెప్పకుండా, “అయితే దేవుడు యూదేతరులకు కూడా జీవంలోనికి నడిపించే పశ్చాత్తాపాన్ని అనుగ్రహించాడని” చెప్పుకొంటూ దేవుని స్తుతించారు.


అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు.


పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రభువైన యేసును నమ్మమని యూదులకు గ్రీసు దేశస్థులకు నేను ప్రకటించాను.


తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు.


ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడి చేతి వైపుకు హెచ్చించారు.


నీ హృదయంలో అలాంటి ఆలోచన కలిగినందుకు క్షమిస్తాడనే నిరీక్షణతో నీ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకో.


సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.


ప్రజలందరు సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.


అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.


ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు.


దేవుడు ఎన్నుకొన్నవారి విశ్వాసాన్ని, నిత్యజీవం గురించిన నిరీక్షణలో ఉండే దైవభక్తిలోనికి నడిపించే, వారి సత్యజ్ఞానాన్ని బలపరచడానికి,


ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.


పరలోకం నుండి ఇవ్వబడిన ప్రతీ మంచిదైన సంపూర్ణమైన బహుమానం వెలుగుకు తండ్రియైనవాని దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఒకచోట నిలబడని నీడల్లా ఆయన ఎన్నడు మారడు.


మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైన ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతోను సమాధానం చెప్పండి.


తన సహోదరుడు లేదా సహోదరి కాని మరణానికి గురి చేయని పాపం చేయడం మీరు చూస్తే, మీరు తప్పక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు వారికి జీవం ఇస్తారు. మరణానికి నడిపించే పాపం ఉంది. మీరు దాని గురించి ప్రార్థించాలని నేను చెప్పడం లేదు.


Lean sinn:

Sanasan


Sanasan