Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 తిమోతికి 5:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటె చెడ్డవారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.

Faic an caibideil Dèan lethbhreac




1 తిమోతికి 5:8
19 Iomraidhean Croise  

వారు ఇంకా మాట వినకపోతే, ఆ సంగతిని సంఘానికి తెలియచేయండి. వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని పక్కనపెట్టి ఒక యూదేతరులుగా లేక పన్ను వసూలుచేసేవారిగా పరిగణించండి.


మీరు చెడ్డవారైనప్పటికీ, మీ పిల్లలకు మంచి బహుమతులను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారు!


నేను వచ్చి వారితో ఈ విషయాలను మాట్లాడి ఉండకపోతే, పాపం చేసామన్న అపరాధ భావన వారిలో ఉండేది కాదు; కాని ఇప్పుడు వారు పాపం చేయలేదని తప్పించుకునే అవకాశం లేదు.


అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్ధానానికి తీసుకువెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు!


నేను మూడవసారి మీ దగ్గరకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీ ధనం కాదు కాని మీరే. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు పొదుపు చేసి ఉంచాలి.


క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి, అవిశ్వాసికి పొత్తు ఏమిటి?


కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందినవారికి మంచి చేద్దాం.


మనం భరిస్తే, ఆయనతోపాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనలను తిరస్కరిస్తారు;


దైవభక్తి కలిగివున్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు.


వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నా, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.


అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, వారిని కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ, వేగంగా వారి మీదికి వారే నాశనం తెచ్చుకొంటారు.


ఎవరి తీర్పైతే చాలాకాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసుక్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.


సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నా నమ్మకమైన సాక్షి అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాలలో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.


నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు.


Lean sinn:

Sanasan


Sanasan