Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 తిమోతికి 5:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి బోధించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్నవాళ్ళను నీ తమ్ముళ్ళుగా భావించు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి ప్రోత్సహించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి ప్రోత్సహించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,

Faic an caibideil Dèan lethbhreac




1 తిమోతికి 5:1
26 Iomraidhean Croise  

“కానీ మీరు ‘రబ్బీ’ అని పిలిపించుకోవద్దు, ఎందుకంటే మీరందరు అన్నదమ్ములు, మీకు ఒక్కడే బోధకుడున్నాడు.


పౌలు మరియు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు.


వారు యెరూషలేము చేరుకొన్నప్పుడు, సంఘస్థులు అపొస్తలులు మరియు సంఘపెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరికి దేవుడు తమ ద్వారా జరిగించిన వాటన్నింటిని వివరించారు.


కనుక ఈ ప్రశ్నను గురించి చర్చించడానికి అపొస్తలులు మరియు సంఘపెద్దలు సమావేశమయ్యారు.


పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.


మీరు ఎవరికి ఏమి రుణపడివున్నారో వాటిని వారందరికి చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి వుంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే, ఆదాయపన్ను; మర్యాదైతే, మర్యాద; గౌరవమైతే, గౌరవం.


సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.


సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు.


సంపూర్ణమైన పవిత్రతతో నీ కన్నా పెద్దవారైన స్త్రీలను తల్లులుగా, నీ కన్నా చిన్నవారైన స్త్రీలను చెల్లెళ్ళుగా చూడు.


వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండుమని బోధించు.


అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండుమని యవ్వన పురుషులను ప్రోత్సహించు.


పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛముగా ఉంటుంది, తరువాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.


మీలో ఎవరైనా అనారోగ్యంతో వున్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి, ఆ పెద్దలు వారికి ప్రార్థన చేసి ప్రభువు పేరిట వారిని నూనెతో అభిషేకించాలి.


తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షపరచబడబోయే మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే:


పెద్దనైన నేను, దేవుని చేత ఎన్నుకోబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు వ్రాయునది: సత్యంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే కాదు, సత్యాన్ని ఎరిగిన వారందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.


పెద్దనైన నేను, సత్యంలో ప్రేమించుచున్న నా ప్రియ స్నేహితుడైన గాయికు వ్రాయునది:


ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చునివున్నారు వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగివున్నారు.


Lean sinn:

Sanasan


Sanasan