Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 తిమోతికి 4:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 వారు ప్రజలను వివాహం చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నింటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిపుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 అలాంటివాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 వారు ప్రజలను పెళ్ళి చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నిటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 వారు ప్రజలను పెళ్ళి చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నిటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




1 తిమోతికి 4:3
30 Iomraidhean Croise  

తర్వాత వారిని గడ్డి మీద కూర్చోమని చెప్పి, ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు.


నోటిలోకి వెళ్లేవి ఒకరిని అపవిత్రపరచవు, కాని నోటి నుండి బయటికి వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రపరుస్తాయి” అని వారితో చెప్పారు.


ఆ ఏడు రొట్టెలను చేపలను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చారు, వారు ప్రజలందరికి పంచిపెట్టారు.


యేసు వారితో భోజనానికి కూర్చున్నపుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు.


ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలను తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి.


అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకొని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు.


దేవుని రాజ్యం తిని త్రాగే వాటికి సంబంధించింది కాదు గాని, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందానికి సంబంధించింది.


అన్నిటిని తినేవారు అలా తినని వారిని తిరస్కరించకూడదు, అదే విధంగా అన్నిటిని తిననివారు తినేవారిని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించాడు.


ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కనుక వారు ప్రభువు కొరకే తింటున్నారు. ఆ విధంగా చేయనివారు కూడా ప్రభువు కొరకే చేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు.


“ఆహారం కడుపు కొరకు, కడుపు ఆహారం కొరకు నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తాడు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కొరకు కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే.


అయితే, నీవు పెళ్ళి చేసుకుంటే నీవు పాపం చేయలేదు; కన్య పెళ్ళి చేసుకుంటే ఆమె పాపం చేయలేదు. అయితే పెళ్ళి చేసుకున్నవారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను.


అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వలన మనకు లాభం లేదు.


కనుక, మీరు తిని త్రాగే వాటి గురించి గానీ, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, విశ్రాంతి దిన ఆచారాల గురించి గానీ మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి.


మీరు మాటలలో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.


ప్రజలందరు సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.


కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కనుక మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేనిని తిరస్కరించాల్సిన అవసరం లేదు.


కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు వివాహం చేసుకొని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి.


వివాహం అందరిచేత గౌరవించబడాలి, వివాహ పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు.


అన్ని రకాల వింత బోధలచేత దూరంగా వెళ్లిపోకండి. ఆచార సంబంధమైన ఆహారం తినడం వల్ల కాదు, కాని కృప చేత మన హృదయాలు బలపరచబడటం మంచిది; ఆచారాలను పాటించే వారికి ఏ ప్రయోజనం కలుగదు.


Lean sinn:

Sanasan


Sanasan