Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 పేతురు 1:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 యేసుక్రీస్తుకు అపొస్తలుడు, పేతురు, పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి, వలసదారులుగా జీవిస్తున్న దేవునిచేత ఏర్పరచబడిన ప్రజలకు వ్రాయునది,

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి,

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 చెదరిపోయి పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితూనియ ప్రాంతాలలో పరదేశీయులుగా నివసిస్తున్నవాళ్ళకు, యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు వ్రాయునదేమనగా, ప్రియులారా! మీరు దేవునిచే ఎన్నుకోబడ్డవాళ్ళు. మీకు ఆయన అనుగ్రహము, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు, దేవునిచేత ఎన్నుకోబడినవారు ఎవరైతే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి ప్రవాసులుగా జీవిస్తున్నారో వారికి వ్రాయునది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు, దేవునిచేత ఎన్నుకోబడినవారు ఎవరైతే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి ప్రవాసులుగా జీవిస్తున్నారో వారికి వ్రాయునది.

Faic an caibideil Dèan lethbhreac




1 పేతురు 1:1
34 Iomraidhean Croise  

ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు: మొదట, పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను,


“ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని ఎన్నుకోబడినవారి కొరకు ఆ రోజులు తగ్గించబడతాయి.


యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులను ఆయన చూసారు. వారు జాలరులు గనుక, వారు సముద్రంలో వలలు వేస్తున్నారు.


దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా?


మరియు ఆ దేశం కొరకు మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని, పిల్లలందరిని, ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు.


అప్పుడు యూదులు ఒకరితో ఒకరు, “మనం కనుగొనలేని ఏ స్థలానికి ఇతడు వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదరిపోయి జీవిస్తున్న మన ప్రజల దగ్గరకు ఆయన వెళ్లి, గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా?


అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ మేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు.


అంతియొకయలో కొంత కాలం గడిపిన తర్వాత, పౌలు అక్కడి నుండి బయలుదేరి గలతీయ ఫ్రుగియ పరిసర ప్రాంతాలంతట, ఒక స్థలం నుండి మరొక స్థలానికి తిరుగుతూ శిష్యులందరిని బలపరిచాడు.


అలాగే రెండు సంవత్సరాలు కొనసాగేటప్పటికి, ఆసియా ప్రాంతంలో నివసిస్తున్న యూదులు మరియు గ్రీసు దేశస్థులు అందరు ప్రభువు వాక్యాన్ని విన్నారు.


అయితే స్వతంత్రులు అని పిలువబడే సమాజానికి చెందిన కురేనీయులు మరియు అలెక్సంద్రియ, అలాగే కిలికియా మరియు ఆసియా ప్రాంతాల నుండి వచ్చిన యూదులు స్తెఫనుతో వాదించడం మొదలుపెట్టారు.


చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని బోధించారు.


ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు,


సోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాన్ని గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలకు గురైయ్యాము. కనుక మేము జీవితంపై ఆశ వదులుకొన్నాం.


నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది:


ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు పరదేశులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు.


దీన్ని బట్టి మీరు ఇక మీదట పరాయి వారు లేక పరదేశులు కారు, కానీ దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు.


ఆసియా ప్రాంతంలోని విశ్వాసులందరు నన్ను విడిచి వెళ్లిపోయారని నీకు తెలుసు, వారిలో ఫుగెల్లు, హెర్మొగెనే అనేవారు కూడా ఉన్నారు.


వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము పరదేశులమని అపరిచితులమని ఒప్పుకొన్నారు.


దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు సేవకుడనైన, యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాయునది: మీకు శుభాలు.


ప్రియ మిత్రులారా, ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కనుక వాటికి విడిచిపెట్టండి.


యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు, మన దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు నీతిని బట్టి మావలె అమూల్యమైన విశ్వాసం పొందినవారికి వ్రాయునది.


ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను.


Lean sinn:

Sanasan


Sanasan