Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 5:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అప్పుడు అతడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన పాపం వల్ల కలిగిన నష్టాన్ని అతడు చెల్లించాలి. ఆ రుసుముకి అదనంగా దానిలో ఐదో వంతు కలిపి చెల్లించాలి. తాను ఎవరికి విరోధంగా పాపం చేసాడో వారికి దాన్ని చెల్లించాలి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 కనుక అతడు తాను చేసిన పాపం గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు చేసిన తప్పుకు పూర్తిగా విలువ చెల్లించాలి. అతడు ఎవరికి నష్టం కలిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సిన దానికి ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి.

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 5:7
14 Iomraidhean Croise  

అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు. సెలా


తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.


“ ‘కాని వారు తమ పాపాలను, వారి పూర్వికుల పాపాలను ఒప్పుకుని అంటే వారు నాకు చేసిన ద్రోహం, తద్వార నేను వారికి విరుద్ధంగా నడిచి, వారిని శత్రువుల దేశానికి పంపానని ఒప్పుకుని, అంటే సున్నతిలేనివారి హృదయాలు తగ్గించుకొని వారి పాపాలకు వారు మూల్యం చెల్లిస్తే,


“యెహోవాకు చెందిన పరిశుద్ధమైన వాటిలో దేని విషయంలోనైనా, ఎవరైనా అనుకోకుండ పాపం చేసి ఎవరైనా యెహోవా పట్ల నమ్మకద్రోహులైతే, వారు మంద నుండి లోపం లేని, పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం, వెండిలో సరియైన విలువగల ఒక పొట్టేలును ప్రాయశ్చిత్తంగా తీసుకురావాలి. ఇది అపరాధపరిహారబలి.


ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.


ఎవరైనా ఈ విషయాల్లో అపరాధులని గ్రహిస్తే, వారు ఏ విధంగా పాపం చేశారో అది ఒప్పుకోవాలి.


“ ‘అదే నియమం పాపపరిహారబలి, అపరాధపరిహారబలి, రెండింటికీ వర్తిస్తుంది: వాటితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అవి చెందుతాయి.


అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి.


కానీ జక్కయ్య నిలబడి ప్రభువుతో, “చూడు, ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను, నేనెవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే, వారికి నాలుగంతలు నేను చెల్లిస్తాను” అని చెప్పాడు.


అప్పుడు యెహోషువ ఆకానుతో, “నా కుమారుడా, నిజం చెప్పి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ కలిగేలా ఆయనను ఘనపరచు. నువ్వేం చేశావో నాతో చెప్పు; దాన్ని నా దగ్గర దాచవద్దు అన్నాడు” అన్నాడు.


Lean sinn:

Sanasan


Sanasan