Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 3:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 “అహరోనును, అతని కుమారులను యాజకులుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా చంపివేయబడాలి.”

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.”

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 3:10
25 Iomraidhean Croise  

ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా కోపం అతని మీద రగులుకుని దేవుడు అతన్ని మొత్తగా అతడు దేవుని మందసం ప్రక్కనే పడి చనిపోయాడు.


యరొబాము ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలు కట్టించి, లేవీయులు కాకపోయినా సరే, సాధారణ ప్రజలనే యాజకులుగా నియమించాడు.


సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.


కాని నేను, “నాలాంటివాడు పారిపోవాలా? లేదా నా లాంటివాడు ప్రాణాలు కాపాడుకోడానికి గర్భాలయంలోకి వెళ్లి దాక్కోవాలా? నేను వెళ్లను” అన్నాను.


వారిపై టోపీలు పెట్టాలి. తర్వాత అహరోనుకు, అతని కుమారులకు నడికట్టు కట్టాలి. నిత్య కట్టుబాటు ద్వారా యాజకత్వం వారిదవుతుంది. “ఈ విధంగా అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించాలి.


మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.


“ ‘పరిశుద్ధ అర్పణను యాజక కుటుంబ సభ్యులు తప్ప బయటి వారెవరూ అంటే యాజకుని అతిథి గాని అతని ఇంట్లో జీతగాడు గాని తినకూడదు.


సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి.


నిన్ను, నీ తోటి లేవీయులను ఆయన చేర్చుకున్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం కూడా కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు.


యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది.


యెహోవా మోషే ద్వారా అతనికి సూచించిన ప్రకారం చేశాడు. అలా ఎందుకు చేయించారంటే, అహరోను వంశస్థుడు తప్ప ఇతరులెవ్వరు యెహోవా ఎదుట ధూపం వేయడానికి రాకూడదని, వస్తే కోరహు అతని అనుచరుల్లా అవుతారని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయడానికి.


వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు.


అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.”


యెహోవా మోషేతో ఇలా కూడా చెప్పారు,


మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.


ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు;


దీన్ని బట్టి మీరు ఇకమీదట పరాయి వారు లేదా విదేశీయులు కారు, దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు.


యెహోవా పేర నిలిచి ఎల్లప్పుడు సేవ చేయటానికి అతని గోత్రాలన్నిటిలో అతన్ని అతని సంతానాన్ని మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు.


ఆయన భూమి మీద ఉండి ఉంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు.


మీకా అనే ఈ వ్యక్తికి క్షేత్రం ఒకటి ఉన్నది, అతడు ఒక ఏఫోదును, మరికొన్ని గృహ దేవుళ్ళ విగ్రహాలను చేయించి, తన కుమారులలో ఒకనిని తన యాజకునిగా నియమించాడు.


బేత్-షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరిచి చూసిన కారణంగా దేవుడు వారిలో డెబ్బై మందిని హతం చేశారు. యెహోవా వారిని బలంగా దెబ్బ కొట్టడం వలన ప్రజలు ఎంతో దుఃఖించారు.


Lean sinn:

Sanasan


Sanasan