Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 2:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమతమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 “యూదా డేరా పతాకం తూర్పుపక్క అంటే సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నాయకుడు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు.

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 2:3
19 Iomraidhean Croise  

ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు. యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు:


లేయా కుమారులు: యాకోబు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.


రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.


యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.)


అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.


“మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;


యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;


బూరధ్వని వినబడినప్పుడు, తూర్పున ఉన్న గోత్రాలు బయలుదేరాలి.


అతని దళంలో ఉన్నవారు 74,600.


మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.


మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను.


సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తెచ్చిన అర్పణ.


అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు శల్మాను.


అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.


Lean sinn:

Sanasan


Sanasan