Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




లేవీయకాండము 22:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 “వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 నీవు వారితో ఇట్లనుము–మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 మీ సంతానమంతటిలో ఎవరైనా వాటిని తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి నానుండి వేరు చేయబడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ వస్తువుల్ని నాకు ఇచ్చారు. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 “వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac




లేవీయకాండము 22:3
10 Iomraidhean Croise  

నేను వారితో, “మీరు, ఈ వస్తువులతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు, ఈ వెండి బంగారాలు మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అర్పణ.


మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.


మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.


దాన్ని పోలిన పరిమళద్రవ్యాన్ని తయారుచేసినవారు, యాజకుల మీద కాకుండా ఇతరుల మీద దానిని పోసిన వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి’ అని చెప్పు.”


“ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.


ఒక మనుష్యుని మృతదేహాన్ని తాకిన తర్వాత తమను తాము శుద్ధి చేసుకోకపోతే, యెహోవా సమావేశ గుడారాన్ని అపవిత్రం చేసినవారవుతారు. అలాంటి వారిని ఇశ్రాయేలు నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు, వారు అపవిత్రులుగా ఉన్నారు. వారి అపవిత్రత వారి మీద ఉంటుంది.


“అప్పుడు ఆయన తన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది వాని దూతల కోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి.


వారు అనుభవించే శిక్ష నిత్య నాశనంగా ఉంటుంది, అలాంటివారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహాప్రభావం నుండి వెళ్లగొట్టబడతారు,


Lean sinn:

Sanasan


Sanasan