Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




లేవీయకాండము 22:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 –ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లువారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 “అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

2 “అహరోనుతో, అతని కుమారులతో చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు నాకు వస్తువులను అర్పిస్తారు. ఆ వస్తువులు పవిత్రం అవుతాయి. అవి నావి. అందుచేత యాజకులైన మీరు వాటిని తీసుకోగూడదు. పవిత్రమైన ఆ వస్తువుల్ని మీరు ఉపయోగిస్తే, నా పవిత్రనామం అంటే మీకు గౌరవం లేదని మీరు వ్యక్తం చేస్తారు. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac




లేవీయకాండము 22:2
16 Iomraidhean Croise  

నేను వారితో, “మీరు, ఈ వస్తువులతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు, ఈ వెండి బంగారాలు మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అర్పణ.


ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి.


అది అహరోను నుదిటిపై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించే పవిత్ర బహుమతులలో, ఆ బహుమతులు ఏవైనా సరే, వాటిలో ఉన్న అపరాధాన్ని అతడు భరిస్తాడు, అది అహరోను నుదుటిపై నిరంతరం ఉంటుంది, తద్వారా వారు యెహోవాకు అంగీకారంగా ఉంటారు.


వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి! అపవిత్రమైన దానిని తాకకండి! యెహోవా మందిరపు ఉపకరణాలను మోసేవారలారా, అక్కడినుండి వెళ్లి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.


మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.


“ ‘తమను అపవిత్రం చేసే వాటినుండి మీరు ఇశ్రాయేలీయులను దూరంగా ఉంచాలి, తద్వార వారి మధ్య ఉన్న నా నివాస స్థలాన్ని వారు అపవిత్రం చేసినందుకు వారి అపవిత్రతలో వారు చావరు.’ ”


“ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.


“ ‘నా పేరిట అబద్ధ ప్రమాణాలు చేసి మీ దేవుని పేరు అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.


వారు తమ పిల్లలను మోలెకుకు బలి ఇచ్చి నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు, నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేశారు కాబట్టి నేను వారికి విరోధిగా మారి ప్రజల్లో నుండి వారిని తొలగిస్తాను.


వారు తమ దేవునికి పరిశుద్ధులై ఉండాలి. వారు తమ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. వారు దేవుని ఆహారమైన హోమబలులను యెహోవాకు సమర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులై ఉండాలి.


యెహోవా మోషేతో అన్నారు,


నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల ద్వార పరిశుద్ధునిగా గుర్తించబడాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచిన యెహోవాను,


మీరు దానిలో ఉత్తమమైన వాటిని అర్పించినప్పుడు మీరు దాని గురించి ఎటువంటి పాపశిక్షను భరించరు; అయితే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ అర్పణలను అపవిత్రపరచవద్దు. అప్పుడు మీరు చావరు.’ ”


పశువుల మందలో మొదట పుట్టిన ప్రతి మగదానిని మీ దేవుడైన యెహోవా కోసం పవిత్రపరచాలి. మీ ఎద్దులలో మొదట పుట్టిన దానితో పని చేయించకూడదు, గొర్రెలలో మొదట పుట్టిన దాని బొచ్చు కత్తిరించకూడదు.


Lean sinn:

Sanasan


Sanasan