Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




విలాపవాక్యములు 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 శత్రువు తన చేతిని చాచాడు. అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు. వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమె చూసింది. ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.

Faic an caibideil Dèan lethbhreac




విలాపవాక్యములు 1:10
22 Iomraidhean Croise  

అతడు యెహోవా మందిరం నుండి పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా అన్ని వస్తువులను, యెహోవా మందిరం నిధులు, రాజు నిధులు, అతని అధికారుల నిధులన్నింటిని బబులోనుకు తీసుకెళ్లాడు.


ఆ రోజున ప్రజల వినికిడిలో మోషే గ్రంథం బిగ్గరగా చదువుతూ ఉండగా; అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని సమాజంలోకి ప్రవేశించకూడదని వ్రాయబడిన భాగం కనబడింది,


మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.


“మీ దేశమంతటా మీరు చేసిన పాపాలన్నిటి కారణంగా మీ సంపదను, మీ ఖజానాను నేను ఎలాంటి రుసుము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.


నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు.


ఎందుకంటే స్తంభాలు, ఇత్తడి నీళ్ల తొట్టె, కదిలే పీటలు ఈ పట్టణంలో మిగిలి ఉన్న ఇతర వస్తువుల గురించి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు,


యెహోవా మందిరంలో, అలాగే యూదారాజు యొక్క రాజభవనంలో యెరూషలేములోను మిగిలిపోయిన వాటి గురించి ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా చెప్పారు:


బబులోను నుండి తప్పించుకొని పారిపోయినవారి శబ్దం వినిపిస్తుంది మన దేవుడైన యెహోవా తన మందిరం కోసం ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో, సీయోనులో ప్రకటించండి.


“మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.”


అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.


తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. ఆమె శత్రువులు ఆమె వైపు చూసి ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.


మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.


వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు. వారు దానిలోనికి వెళ్లి దానిని మలినం చేస్తారు.


ఆయన వారితో, “మందిరాన్ని అపవిత్రం చేయండి. ఆవరణాలను శవాలతో నింపండి. మొదలుపెట్టండి” అన్నారు. వారు బయలుదేరి వెళ్లి పట్టణంలో అందరిని చంపడం మొదలుపెట్టారు.


“ ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, చదివేవాడు అర్థం చేసుకొనును గాక, అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి.


అమ్మోనీయులే గాని మోయాబీయులే గాని లేదా వారి సంతతివారే గాని పదితరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించలేరు.


మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు.


Lean sinn:

Sanasan


Sanasan