యిర్మీయా 5:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’ Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 –మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము–మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 “మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?” అని అడిగినప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు. Faic an caibideilపవిత్ర బైబిల్19 యూదా ప్రజలు నిన్ను, ‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు. అప్పుడు నీవు, ‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు. మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు. మీరలా ప్రవర్తించారు గనుక ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.” Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’ Faic an caibideil |