Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 5:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది” అని చెబుతారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకుతారు, దేవుని వాక్కు వారియందు లేదు. వారికి కీడు మూడుతుంది.”

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 5:13
13 Iomraidhean Croise  

కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన మాటలను తృణీకరించారు, ఆయన ప్రజలపైకి నివారించలేని యెహోవా ఉగ్రత వచ్చేవరకు వారు ఆయన ప్రవక్తలను అపహాస్యం చేశారు.


నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా?


“ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి.


బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు.


చూడండి, వారందరు మాయాస్వరూపులే వారి క్రియలు మోసమే; వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.


అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.”


కాబట్టి నా పేరుతో ప్రవచిస్తున్న ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను వారిని పంపలేదు, అయినా వారు, ‘ఖడ్గం గాని కరువు గాని ఈ దేశాన్ని తాకవు’ అని చెప్తున్నారు. అలా ప్రవచిస్తున్న ప్రవక్తలే ఖడ్గం కరువుతో నశిస్తారు.


వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.


గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు.


బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను.


హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.


శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.


Lean sinn:

Sanasan


Sanasan