యిర్మీయా 48:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈకుండలోనుండి ఆకుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 మోయాబు తన బాల్యం నుండీ సురక్షితంగానే ఉన్నట్టు భావించాడు. అతడు ఒక పాత్రనుండి మరో పాత్రకు పోయని ద్రాక్షరసంలా ఉన్నాడు. అలాగే అతడు ఎప్పుడూ చెరలోకి వెళ్ళలేదు. కాబట్టి అతని రుచి ఎప్పటిలా బాగానే ఉంది. సువాసన కూడా మారకుండా ఉంది. Faic an caibideilపవిత్ర బైబిల్11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు. కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది. మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు. అతడు నిర్బంధించబడి ఇతర దేశానికి కొనిపోబడలేదు. పూర్వంవలెనే అతడు ఇప్పుడూ రుచిగానే వున్నాడు. అతని సువాసన మారలేదు.” Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.” Faic an caibideil |