Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 4:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి; దాని పట్టణాలన్ని యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 నేను చూస్తూ ఉండగా యెహోవా కోపాగ్నికి ఫలవంతమైన భూమి ఎడారిలా మారింది. అందులోని పట్టణాలన్నీ పూర్తిగా కూలిపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది. ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశనమయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. అధికమైన యెహోవా కోపమే దీనిని కలుగచేసింది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి; దాని పట్టణాలన్ని యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 4:26
15 Iomraidhean Croise  

మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?


వారు గోధుమలు విత్తుతారు కాని ముళ్ళ పంట కోస్తారు; వారు పనితో అలసిపోతారు కాని లాభం ఉండదు. యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.”


ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి? ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి? అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి జంతువులు, పక్షులు నశించాయి. “మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు” అని ప్రజలు అంటున్నారు.


ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి.


యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది.


నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.


ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి, తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు. ఆయన ఆమె రాజభవనాల గోడలను శత్రువుల చేతికి అప్పగించారు; నియామక పండుగ రోజున చేసినట్టుగా వారు యెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు.


నేను మీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను, మీ పరిశుద్ధాలయాలను వృథా చేస్తాను, మీ అర్పణల సువాసన యందు నేను ఆనందించను.


కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.


యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.


Lean sinn:

Sanasan


Sanasan