యిర్మీయా 2:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు. అంటే ‘అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రజలు అడగడం లేదు. Faic an caibideilపవిత్ర బైబిల్6 ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మాకు ఎడారులలో మార్గదర్శి అయిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ, ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు. ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు. కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’ మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.” Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు. Faic an caibideil |
అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు.