Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 2:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 “దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; వారు వారి రాజులు వారి అధికారులు, వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు–నీవు మా తండ్రివని మ్రానుతోను –నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

26 “ప్రజలు పట్టుకున్నప్పుడు దొంగ సిగ్గుపడతాడు అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు. ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 “దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; వారు వారి రాజులు వారి అధికారులు, వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 2:26
18 Iomraidhean Croise  

మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.


వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!


“మీరు వేటిని బట్టి ఆనందించారో ఆ పవిత్ర సింధూర వృక్షాల గురించి మీరు సిగ్గుపడతారు; మీరు ఎంచుకున్న సింధూర తోటల గురించి మీరు అవమానించబడతారు.


అలా చేసే ప్రజలందరూ సిగ్గుపరచబడతారు. ఆ శిల్పకారులు కేవలం మనుష్యులే. వారందరు కలిసివచ్చి నిలబడాలి; వారు భయానికి గురై సిగ్గుపడతారు.


విగ్రహాలను చేసే వారందరు వట్టివారు. వారు నిధిగా ఉంచిన వస్తువులు పనికిరానివి. వారి కోసం మాట్లాడేవారు గ్రుడ్డివారు; వారు తెలివిలేనివారు, వారు సిగ్గుపరచబడతారు.


నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.


గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు.


ఇశ్రాయేలు, యూదా ప్రజలు, వారి రాజులు, అధికారులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదా ప్రజలు యెరూషలేములో నివసించేవారు తాము చేసిన వాటన్నిటితో నాకు కోపం రేపారు.


యెహోవా ఇలా అంటున్నాడు, “ఆ రోజు రాజు, అధికారులు ధైర్యం కోల్పోతారు, యాజకులు భయపడతారు, ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”


ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?


తద్వార వారి ఆదరణ కోసం నీవు చేసిన దానంతటిని బట్టి నీవు అవమానాన్ని భరించి సిగ్గుపడతావు.


దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని మీరి నా పరిశుద్ధ వస్తువులను అపవిత్రం చేస్తారు; పరిశుద్ధమైన వాటికి సాధారణమైన వాటికి మధ్య భేదం వారికి తెలియదు. పవిత్రతకు అపవిత్రతకు మధ్య ఉన్న భేదాన్ని ప్రజలకు నేర్పించరు. నా విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేస్తారు. వారి మధ్య నేను అపవిత్రం అయ్యాను.


సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”


గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి? వాటివలన మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా! ఆ పనుల ఫలం మరణమే!


Lean sinn:

Sanasan


Sanasan