Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 2:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

19 మీరు చెడు పనులు చేశారు. మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి. మీకు కష్టాలు సంభవిస్తాయి. ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది. దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!” ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 2:19
40 Iomraidhean Croise  

అందుకు ఏలీయా, “నేను కాదు; నీవు, నీ తండ్రి కుటుంబం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను తిరస్కరించి, బయలును అనుసరించి మీరే ఇశ్రాయేలును కష్టపెట్టారు.


అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరకు, షీషకుకు భయపడి యెరూషలేముకు వచ్చి చేరిన యూదా అధిపతుల దగ్గరకు వచ్చి వారితో, “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను” అని చెప్పాడు.


ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది, ఎందుకంటే యెహోరాము తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు.


ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు, “నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించామా? ఆపు! ఎందుకు చావాలనుకుంటున్నావు?” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త, “నీవు అప్పుడు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకున్నాడు.


దుష్టుల పాప స్వభావాన్ని గురించి నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; వారి కళ్లలో దేవుని భయం లేదు.


కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం దగ్గర నుండి తమ ఆభరణాలను ధరించలేదు.


వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.


మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది;


దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి; వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి.


వారి ముఖమే వారి మీద సాక్ష్యమిస్తుంది; వారు తమ పాపాన్ని సొదొమలా ప్రకటిస్తారు; వారు దానిని దాచిపెట్టరు. వారికి శ్రమ! వారు తమ మీద తామే విపత్తు తెచ్చుకున్నారు.


నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.


యెహోవా చెప్పే మాట ఇదే: “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఎక్కడ? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేశాను? మీ పాపాలను బట్టి మీరు అమ్మబడ్డారు; మీ అతిక్రమాలను బట్టి మీ తల్లి పంపివేయబడింది.


నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను.


“నాకే ఎందుకు ఇలా జరిగింది?” అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీ అనేక పాపాల కారణంగానే నీ వస్త్రాలు చింపబడ్డాయి నీ శరీరం అసభ్యంగా తాకబడింది.


కానీ నీ దేవుడైన యెహోవా మార్గంలో నిన్ను నడిపిస్తున్నప్పుడు, నీవు ఆయనను విడిచిపెట్టి, నీకు నీవే ఇదంతా నీ మీదికి తెచ్చుకోలేదా?


“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.


“మీ ప్రవర్తన మీ క్రియలు దీన్ని మీపైకి తెచ్చాయి. ఇది నీకు శిక్ష. ఎంత చేదుగా ఉంది! అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!”


మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.


‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ అని వారు తమ హృదయాల్లో అనుకోరు.


కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ.


కానీ వారు కోపం రెచ్చగొడుతుంది నన్నా? వారు తమకు అవమానం కలిగేలా, తమకు తాము హాని చేసుకోవడం లేదా? అని యెహోవా అడుగుతున్నారు.


అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు? యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది? వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు; వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు.


నీవు దేశాలను మోహించి, వారి విగ్రహాలతో నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నావు, నీ అశ్లీలత, వ్యభిచారం వల్లనే ఇది నీ మీదికి వచ్చింది.


వారి అపవిత్రత తిరుగుబాటుతనం బట్టి నేను వారికి విరోధినై వారికి తగిన ప్రతీకారం చేశాను.


నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు. వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా, నేను ఏ విధంగాను వారిని హెచ్చించను.


“ఇశ్రాయేలూ! నీవు నాశనమవుతావు ఎందుకంటే నీవు నీ సహాయకుడనైన నాకు విరుద్ధంగా ఉన్నావు.


ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!


పొగరుబోతు పెయ్యలా ఇశ్రాయేలీయులు మొండిగా ఉన్నారు. అలాగైతే యెహోవా వారిని విశాల మైదానంలో గొర్రెపిల్లలను మేపినట్టు ఎలా పోషిస్తారు?


ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; యూదా కూడా వారితో తడబడుతుంది.


అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని వారు గ్రహించరు. వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.


ఇశ్రాయేలూ, ఆనందించకు; ఇతర దేశాల్లా ఉత్సాహపడకు. నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు; ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు.


నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, తల గొరిగించుకునేలా చేస్తాను. ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది.


దీనంతటికీ యాకోబు అతిక్రమం, ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. యాకోబు అతిక్రమం ఏంటి? అది సమరయ కాదా? యూదా యొక్క క్షేత్రం ఏంటి? అది యెరూషలేము కాదా?


“కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు.


“వారి కళ్లలో దేవుని భయం లేదు.”


అయితే మీరు నన్ను విడిచి ఇతర దేవుళ్ళను సేవించారు కాబట్టి నేను మిమ్మల్ని ఇక కాపాడను.


Lean sinn:

Sanasan


Sanasan