యిర్మీయా 15:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారితట్టునకు తిరుగకూడదు Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు. Faic an caibideilపవిత్ర బైబిల్19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే నిన్ను నేను శిక్షించను. నీవు మారి నావద్దకు వస్తే నీవు నన్ను వెంబడించగలవు. వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే నాగురించి నీవు మాట్లాడగలవు. యూదా ప్రజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి. అంతేగాని నీవు మారి, వారిలా వుండకూడదు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు. Faic an caibideil |