యిర్మీయా 15:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, కలహాలు పెట్టుకునేవానిగా, నీవు నాకు జన్మనిచ్చావు! నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదు లిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించుచున్నారు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు. Faic an caibideilపవిత్ర బైబిల్10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది. నేను దుఃఖపడుతున్నాను. నేను దురదృష్టవంతుడను. ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను. నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు. కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు! Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, కలహాలు పెట్టుకునేవానిగా, నీవు నాకు జన్మనిచ్చావు! నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు. Faic an caibideil |
అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు. అందుకు యెహోషాపాతు, “రాజా, మీరు అలా అనవద్దు” అన్నాడు.