యిర్మీయా 14:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.” Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవావారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షిం చును. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. “తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.” యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు. Faic an caibideilపవిత్ర బైబిల్10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.” Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.” Faic an caibideil |