Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 11:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 అందుకే నిన్ను చంపుతానని బెదిరిస్తున్న అనాతోతు ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు, “యెహోవా పేరిట ప్రవచించకండి, అలా చేస్తే మా చేతిలోనే చస్తారు.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 కావున –నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 “నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

21 అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపుటకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక నిర్ణయానికి వచ్చాడు.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 అందుకే నిన్ను చంపుతానని బెదిరిస్తున్న అనాతోతు ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు, “యెహోవా పేరిట ప్రవచించకండి, అలా చేస్తే మా చేతిలోనే చస్తారు.”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 11:21
22 Iomraidhean Croise  

వారు దీర్ఘదర్శులతో, “ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు. అలాగే ప్రవక్తలతో, “సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు. మాకు అనుకూలమైన విషయాలు భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి.


బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు.


వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”


అయితే చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించినవన్నీ యిర్మీయా ప్రజలందరికి చెప్పడం ముగించిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతన్ని పట్టుకుని, “నీవు తప్పక చావాల్సిందే!


నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు.


వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.


“అయితే మీరు నాజీరులతో ద్రాక్షరసం త్రాగించారు, ప్రవచించ వద్దని ప్రవక్తలను ఆదేశించారు.


కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు, తల్లి మీదికి కుమార్తె, అత్త మీదికి తన కోడలు తిరగబడతారు, సొంత ఇంటివారే వారికి శత్రువులవుతారు.


“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.


“ఆ రైతులు అతని దాసులను పట్టుకున్నారు; వారు ఒకని కొట్టారు, ఒకని చంపారు, మరొకని మీద రాళ్లు విసిరారు.


మిగిలిన వారు ఆ పిలుపును తెచ్చిన పనివారిని పట్టుకుని, అవమానించి వారిని చంపారు.


ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను.


Lean sinn:

Sanasan


Sanasan