యిర్మీయా 11:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’ Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు. Faic an caibideilపవిత్ర బైబిల్13 “యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’ Faic an caibideil |
“నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; నేను మీ పూర్వికులను చూసినప్పుడు, అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు.