Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 సమూయేలు 3:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. దావీదు అంతకంతకు బలపడుతుంటే సౌలు కుటుంబం బలహీనమవుతూ వచ్చింది.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. దావీదు అంతకంతకు బలపడుతుంటే సౌలు కుటుంబం బలహీనమవుతూ వచ్చింది.

Faic an caibideil Dèan lethbhreac




2 సమూయేలు 3:1
26 Iomraidhean Croise  

రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.


నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది.


ఆ రోజు భయంకరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలీయులు దావీదు సైన్యం ముందు ఓడిపోయారు.


ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాము.


వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు వారి బలం అధికమవుతుంది.


అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు.


శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.


హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”


ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.


ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.


నేను నీకు స్త్రీకి మధ్య, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య శత్రుత్వం కలుగజేస్తాను; అతడు నీ తలను చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కాటేస్తావు” అని అన్నారు.


నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు.


అప్పుడు యోవాబు బూర ఊదినప్పుడు, అందరు ఇశ్రాయేలీయులను వెంటాడడం, యుద్ధం చేయడం ఆపివేశారు.


సైన్యాల యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.


“జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.


సైన్యాల యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.


మొర్దెకై రాజభవనంలో ప్రముఖుడయ్యాడు; అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది, అతడు అంతకంతకు శక్తిగలవాడయ్యాడు.


ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.


ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు.


సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్నేరు సౌలు కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకున్నాడు.


దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు వీరు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను మొదటి కుమారుడు; కర్మెలుకు చెందిన అబీగయీలుకు పుట్టిన దానియేలు రెండవ కుమారుడు;


Lean sinn:

Sanasan


Sanasan